Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 90.09 శాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ-హసన్‌పర్తి
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో టీఎస్ ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 66,034 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 51,316 మంది (90.09 శాతం) ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. గురువారం యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఐసెట్ వివరాలు వెల్లడించారు. ఐసెట్ రాసిన వారిలో.. 28,848 మంది పురుషులకు గాను 26,057 మంది (89.84 శాతం),28,111 మంది మహిళలకు గాను 25,256 మంది (89.84శాతం)ఉత్తీర్ణత సాధించారన్నారు. ముగ్గురు ట్రాన్స్‌జెండ ర్లు కూడా ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రవేశాల షెడ్యూల్‌ను రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల డిగ్రీ ఫలితాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. ఈడబ్ల్యుఎస్ అమలులో ఉంటుదని తెలిపారు. ఫలితాల ప్రకటనపై కన్వీనర్‌ను అభినందించారు.కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, టీఎస్ ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, రిజిస్ట్రార్ బి.వెంకట్రాంరెడ్డి, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వరలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.