Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు
- 15 మంది వద్ద రూ.75 లక్షలు వసూలు
- ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్.. పరారీలో నలుగురు
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హుస్నాబాద్ ప్రాంతంలోని అక్కన్నపేట, హుస్నాబాద్,కోహెడ,వరంగల్,హుజూరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముఠా గుట్టు రట్టయింది.నిందితుల్లో ఒకడైన ఓ ప్రభుత్వ ఉద్యోగున్ని పోలీసు లు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్, సీఐ లతాకుల రఘుపతిరెడ్డి అక్కన్నపేట పోలీసు స్టేషన్లో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న రాజ్‌కుమార్‌తో పాటు ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న భీమ్ నాయక్, కరీంనగర్‌కు చెందిన గుగులోతు సదానందం,వరంగల్‌కు చెందిన దాడి సాయి చందు, హుజురాబాద్‌కు చెంది న విజ్జ గిరి శ్రీనివాస్, వరంగల్‌కు చెందిన సారంగం ముఠాగా ఏర్పడ్డారు.