Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం విద్యాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగుల నరేశంను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ తీసుకున్న చర్యలను వెంటనే ఉప సంహరించుకోవాలని కోరుతూ గురువారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధి బృందం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేసింది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే అభిప్రాయంతో, తాను పనిచేస్తున్న పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు అవసరం ఉంటుందని భావించిన పేరెంట్స్ కమిటి ఇద్దరు వాలంటీర్లను నియమించుకున్నదని తెలిపారు. వారికి ప్రజల భాగస్వామ్యంతో జీతాలు చెల్లించడంలో మండల విద్యాధికారికి ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. పాఠశాలల్లో చాక్పీసులకు కూడా కరువు అనే శీర్షికతో ఒక వార్తా పత్రికలో వచ్చిన అంశాలతో కూడా అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినప్పటికీ అకారణంగా మండల విద్యాధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సంబంధిత బాధ్యులతో మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు పి రాజభాను చంద్రప్రకాశ్, ఎస్ గిరిధర్ ఎ కష్ణ, పి శ్రీనివాస్, భూపతి, ఆనందరావు, జి నరేషం రంగారెడ్డి, జగిత్యాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.