Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అదుపులో నిందితుడు
- ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-బిచ్కుంద
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన తాతినేని శ్రీనివాసరావు జుక్కల్ మండలానికి చెందిన మహిళతో కలిసి తన ఇంట్లో మద్యం సేవించి మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి చేశాడు. మహిళ భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సత్యనారాయణ నిందితున్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం బాన్సువాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితునిపై 376 అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గురువారం డీఎస్పీ జైపాల్‌రెడ్డి బిచ్కుంద పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఘటనపై ఆరాతీశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.