Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో దాదాపు 10 లక్షల టన్నుల చెరుకు పండిస్తున్నారనీ, అక్కడ ఏర్పాటు చేసిన ట్రైడెంట్ పంచదార ఫ్యాక్టరీని మూసివేయడం సరైంది కాదని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడింది. వెంటనే ఆ ఫ్యాక్టరీని తెరవాలని డిమాండ్ చేసింది. చెరుకు రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగఱ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పంచదార ఫ్యాక్టరీ మూసివేయడంతో రైతులు కర్ణాటకకు వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో చెరుకు పంట సాగై, 11 చెరుకు ఫ్యాక్టరీల్లో క్రాస్సిగ్ అవుతుందని తెలిపారు. ప్రస్తుతం వాటిలో 4 ఫ్యాక్టరీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజామాబాద్, బోధన్‌లో మూతపడిన ఆ ఫ్యాక్టరీలను తెరిపిస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అప్పటికీ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. చెరుకు పంటకు క్వింటాల్‌కు రూ 290 మద్దతు ధర నిర్ణయించినప్పటకీ, డిమాండుమేరకు ఆయా ఫ్యాక్టరీలు రూ 350 వరకు చెల్లిస్తున్నాయని తెలిపారు. పంటకు గ్యారెంటీ ఆదాయం రావడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. చెరుకు రైతు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 1.20 లక్షల ఎకరాల నుంచి 50 వేల ఎకరాలకు సాగు తగ్గిపోయిందని తెలిపారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఆ పంట పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని ట్రైడెంట్ పంచదార ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.