Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,677 మంది నియామకానికి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా పేరు మార్చిన నేపథ్యంలో వాటిలో మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ 1,677 మంది ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారిని నియమించుకునేందుకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉన్న జిల్లా ఎంపిక కమిటీ ఈ ఎంపికను చేపట్టనున్నది.