Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి వేసిన రిట్‌ను గురువారం హైకోర్టు కొట్టేసింది. ఏపీలోని ఓబుళాపురం మైనింగ్‌లో జరిగిన భూమి సరిహద్దు వివాదం ఆంధ్రప్రదేశ్, కర్నాటకల మధ్య పరిష్కారం అయ్యే వరకూ ఆ ఒఎంసీ కేసులో సీబీఐ కోర్టు విచారణను నిలిపివేయాలన్న ఆమె అభ్యర్దనను హైకోర్టు తిరస్కరించింది. ఈ దర్యాప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పు చెప్పారు. భూ సరిహద్దు వివాదానికి ఒఏంసీ కేసు విచారణకు సంబంధం లేదని, సీబీఐ కోర్టు దర్యాప్తును కొనసాగించొచ్చని స్పష్టం చేశారు.
కోర్టు ధిక్కార కేసులో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టు నోటీసులు
భూసేకరణ పరిహారం కింద చెల్లించాల్సిన రూ.52 లక్షలు, వడ్డీ రూ.5.48 లక్షలు చెల్లించాలన్న గత ఉత్తర్వులను అమలు చేయలేదని జగిత్యాల జిల్లా రత్నాపూర్‌కు చెందిన బి.లింగన్న , మరో ఐదుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణరావు ఈ నెల 29న స్వయంగా హైకోర్టు విచారణకు రావాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు కోర్టుధిక్కార నోటీసులు జారీ చేసింది. తామిచ్చిన ఉత్తర్వుల మేరకు రైతులకు పరిహారం ఎందుకు చెల్లించలేదో చెప్పాలంటూ కోర్టు ప్రశ్నించింది. కోర్టుధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరింది. విచారణ 29కి వాయిదా వేసింది.