Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్థరాత్రుళ్లు కరెంట్ కట్ చేయం
- మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ నమ్మొద్దు.: టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ బిల్లుల బకాయిలు ఉన్నందున రాత్రి 10.30 గంటల తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తా మంటూ వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిపేయకుండా ఉండేందుకు, బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్ అధికారికి 9692848762 నెంబర్‌కు కాల్ చేయాలనే మోసపూరిత మెసేజ్‌లు పంపి సైబర్ నేరగాళ్లువిద్యుత్ వినియోగదారులను మోసగిస్తున్నట్టు తమ దష్టికి వచ్చిందన్నారు. గతంలో కూడా కొందరు మోసగాళ్లు ఇలాంటి నేరాలకే పాల్పడ్డారని తెలి పారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని నమ్మవద్దని ఓ ప్రకటనలో కోరారు. విద్యుత్ సంస్థలు బిల్లులు కట్టకుంటే రాత్రివేళల్లో కనెక్షన్లు కట్ చేయబోవని స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. బిల్లు చెల్లింపుల వివరా లను డిస్కంల అధికారిక వెబ్సైట్లలో ధృవీకరించుకోవాలని చెప్పారు.