Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోటగిరి
ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ రైతులు డిమాండ్ చేశారు. గురువారం పోతంగల్ ఎస్బీఐ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లోని డబ్బులను ప్రయివేటు వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయించి ఖాతాదారులకు తెలియకుండా డబ్బులు కాజేశారని ఆరోపించారు. మెసేజ్‌లు కూడా పంపకుండా డబ్బులు కాజేస్తున్నారన్నారు. పోతంగల్ గ్రామానికి చెందిన పల్లె పండరి అనే రైతు క్రాప్‌లోన్‌కు సంబంధించి రూ.11వేలు చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో రైతు రూ.11వేలు చెల్లించారని తెలిపారు. తిరిగి రూ.26వేలు చెల్లించాలని మేనేజర్ చెప్పడంతో మళ్లీ రూ.26 వేలను చెల్లించాడనీ, సదరు రైతుకు సుమారు రూ.41వేల బ్యాంకు రుణం మంజూరు చేసి అదే రోజు రూ.26వేలను ప్రయివేటు వ్యక్తి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. వెంటనే మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మేనేజర్‌ను వివరణ కోరగా.. పొరపాటు జరిగితే సరిచేస్తామని తెలిపారు.