Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గేట్లు ఎత్తి నీటి విడుదల
నవతెలంగాణ-మెండోరా
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు పోటెత్తుతోంది. గురువారం సాయంత్రం 1.18లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరగా.. అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 99,840 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉండగా ప్రాజెక్టు అధికారులు మిగులు జలాలు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అలాగే ఎస్కేప్ గేట్ల ద్వారా 1500 క్యూసెక్కుల మిగులు జలాలు గోదావరి నదిలోకి విడుదల చేస్తూ 9746 క్యూసెక్కుల నీటిని వరద కాలువకు వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 6000 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 150 క్యూసెక్కుల సాగునీటిని సరఫరా చేస్తున్నారు.