Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రేటర్ హైదరాబాద్, శివారు మున్సిపాల్టీల్లో తాగునీరు, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల నిధుల్ని విడుదల చేసినట్టు పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గురవారంనాడిక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీహెచ్ఆర్డీ)లో ఆయన జలమండలిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జలమండలి సమర్థవంతమైన పనితీరుతో హైదరాబాద్ నగరానికి వాటర్ ప్లస్ సిటీ హౌదా దక్కిందని చెప్పారు. అవుటర్ రింగ్‌రోడ్ లోపల ఉన్న హైదరాబాదులో 1,950 ఎంఎల్డీ మురికి నీరు ఉత్పత్తి అవుతుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.8 శాతం ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి జరుగుతున్నదనీ, అదనంగా మరో 31 ఎస్టీపీలు వేర్వేరు ప్రాంతాల్లో రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కోసం అదనంగా రూ.1,200 కోట్ల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. అలాగే రక్షిత మంచినీటి సరఫరా కోసం నిధులు విడుదల చేశారనీ, వీటిద్వారా దాదాపు 20 లక్షల కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తామన్నారు.