Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) వెల్లడించింది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 11వ ట్రెడా ప్రాపర్టీ షో 100 మందికి పైగా డెవలపర్స్, బిల్డర్లు, ప్రమోటర్లు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయని ఆ వర్గాలు తెలిపాయి. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే కొనుగోలుదారులకు విస్తత శ్రేణి ఆఫర్లను నిర్మాణ సంస్థలు అందిస్తున్నాయని తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షుడు ఆర్ చలపతిరావు తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 800 చదరపు అడుగుల నుంచి 10 వేల చదరపు అడుగుల పై చిలుకు గల సొంతింటి కొనుగోలు దారులకు అందుబాటులో ఉంటాయన్నారు. వీటి ధరల శ్రేణీ రూ.30 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటాయన్నారు. ఈ ప్రాపర్టీషోలో రుణాలు జారీ చేయడానికి వీలుగా 10కి పైగా ఆర్థిక సంస్థలు పాల్గొంటున్నాయన్నారు.