Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అధికారుల బృందం గురువారం బిల్డర్లతో సమావేశం అయ్యింది. హైదరాబాద్ 'అత్యంత నివాసిత నగరం' మార్పునపై ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అమిత్ జింగ్రాన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఆర్థిక మద్దతు అవసరం అనే అంశంపై చర్చించారు. నిర్మాణ రంగానికి ఎస్బీఐ అందిస్తున్న పలు పథకాలపై అధికారులు వివరించారు. ఈ సమావేశానికి ఎస్బీఐ ఉన్నతాధికారులు క్రిషన్ శర్మ, కె పనీంద్రనాథ్, క్రెడారు ప్రెసిడెంట్ పి రామక్రిష్ణ రావు, సెక్రెటరీ వి రాజ శేఖర్ రెడ్డి, ట్రెడా సెక్రెటరీ ఆర్ చలపతి రావు, టీబీఎఫ్ ప్రతినిధి ఆర్ ప్రభాకర్ రావు హాజరయ్యారు.