Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేవీవీ వెబినార్లో డాక్టర్ సుందర్ రామన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా కట్టడిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన కాంటాక్ట్ ట్రేసింగ్ విషయాన్ని భారతదేశంలో దాదాపు నిలిపేశారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆరోగ్య హక్కులు, మానసిక ఆరోగ్యం కోర్ కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా పబ్లిక్ సైన్స్ నెట్వర్క్ ఆరోగ్య కన్వీనర్ డాక్టర్ టి.సుందర్ రామన్ విమర్శించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అందె సత్యం అధ్యక్షతన ఆదివారం 'కరోనా- ప్రజారోగ్య ప్రాధాన్యత' అనే అంశంపై ఆయన ప్రసంగించా రు. ఆస్పత్రులపైభారం తగ్గుతుందని సంబరపడ్డ ప్రభుత్వం హౌం ఐసోలేషన్ విధానాన్ని ప్రోత్సహించిందన్నారు. దీంతో రోగులు ఆస్పత్రుల్లో చేరటం ఆలస్యం కావటంతో మరణా లు పెరిగాయనీ,నివారించదగ్గ మరణాలను కూడా సర్కారు అరికట్టలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఐసోలేషన్లో ఉంటే కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించి క్వారైంటైన్ చేయాల్సి ఉంటుందన్నారు. వీటి కన్నా లాక్ డౌన్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారని తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హౌంశాఖ అధీనంలో ఉండటం, మహమ్మారిని శాంతి భద్రతల కోణంలోనే తీసుకున్నారని తెలిపారు. పోలీసు భయంతో అవసరం లేకున్నా రోడ్లపై మాస్కులు పెట్టుకున్న ప్రజలు తీరా కార్యాలయాలు, గుంపుల్లోకి వెళ్లాక తీసివేయటం కనిపించిందన్నారు. కరోనా వ్యాప్తిని శాస్త్రీయంగా అవగతం చేసుకోవటంలో కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు పెట్టిన సర్కారు ప్రజలకు నిత్యావసర వస్తువుల సరఫరా విషయం మరిచారనీ, దీనితో ఆ బారికేడ్లు పని చేయలేదని తెలిపారు.
ప్రయివేటుపై మోజు....
కరోనా మహమ్మారి వస్తే కనీసం చికిత్స చేసేందుకు రెండు నెలలు ప్రయివేటు రంగం ముందుకు రాలేదని ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత రంగ ప్రవేశం చేసినా అధిక ఛార్జీలు వసూలు చేశారని విమర్శించారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వరప్రసాద్, హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ ఎ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.