Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ ముందు ఓ ఆటో డ్రైవర్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి అసెంబ్లీ గేట్ ముందుకు ఆటోలో వచ్చా డు. అక్కడ ఒంటిపై కిరోసిన్ పోసుకుని.. హౌంమంత్రి మహమూద్ అలీ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తన నిరసనకు గల కారణాన్ని మీడియాకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని పోలీసులు మాట్లాడనీయలేదు. ఆ వ్యక్తి వచ్చిన ఆటోను వారు స్వాధీనం చేసుకున్నారు.