Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు హెచ్ఆర్డీఎ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్), రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) పోస్టులను గతంలో నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీలకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత డిఎంఇ, డిహెచ్ రెగ్యులర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ కు పోగా వాటిని కొత్తగా సృష్టించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అలా రెగ్యులర్ పోస్టులైతే సీనియార్టీ ప్రకారం భర్తీకి అవకాశముంటుందని తెలిపారు. అయితే గత ఏడేండ్లుగా తాత్కాలికంగా ఇన్‌ఛార్జిలతోనే నెట్టుకొస్తున్నారని చెప్పారు. వెంటనే 2002 సర్వీస్ రూల్స్ ప్రకారం డీఎంఇ, డీహెచ్ పోస్టులను సీనియర్లతో భర్తీ చేయాలని కోరారు.