Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిబంధనలను ఎందుకు మార్పు చేశారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రస్ట్‌లో న్యాయవాదులకు అన్యాయం జరిగేలా ఉందన్న పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ఎ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ టి వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ట్రస్ట్ నిబంధనలను మార్పు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బార్ కౌన్సిల్ మెంబర్ ఎస్ సంజీవ్‌రావు సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాదుల సంక్షేమానికి మాత్రమే ఉన్న ట్రస్ట్‌ను ఇప్పుడు బీసీ సంక్షేమంగా నిబంధనలు మార్పు చేశారని, బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు కాకుండా బార్ అసోసియే షన్లో నమోదు చేసుకున్న వారికే వర్తించేలా చేయడం వల్ల రాష్ట్రంలో 42 వేల మంది న్యాయవాదులకుగాను 19 వేల మందికే బీమా వర్తింపు ఉంటుందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు.