Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
నవతెలంగాణ- భద్రాచలం
భద్రాచలం వద్ద గోదావరి 48 గంటలుగా పెరుగుతూ వచ్చి గురువారం మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి 11 గంటలకు 41.8 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ 43 అడుగులకు చేరింది. దాంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు 43.3 అడుగులకు చేరుకున్న నీటిమట్టం నిలకడగా మూడు గంటలు ఉంది. అనంతరం క్రమంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు నీటమునిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గజ ఈతగాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గోదావరి ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నీరు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. 48 గంటల పాటు నది పరివాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంత ప్రజలను, భయ బ్రాంతులకు గురి చేసిన గోదావరి తగ్గుముఖం పట్టడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.