Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భట్టికి టీఎన్ఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) కాంగ్రెస్ పార్టీని కోరింది. ఈ మేరకు టీఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కురుమేటి గోవర్థన్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు, టీఎస్పీఎస్సీ చేసిన నర్సింగ్ పోస్టుల భర్తీలో మిగిలిన 893 పోస్టులు తదితర అంశాలను అసెంబ్లీలో లేవనెత్తాలని కోరారు. ఆయా స్కీంలలో పని చేస్తున్న వారికి బేసిక్ శాలరీ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత, అధికారికంగా జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో పని చేసే నర్సులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.