Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సర్వీసులో ఉండగా కరోనాతో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి సింగరేణి సంస్థ రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేసింది. హైదరాబాద్ సింగరేణి భవన్లో డ్రైవర్‌గా పని చేస్తున్న అట్లూరి రమేష్ బాబు 2021 ఏప్రిల్ నెలలో రిటైర్ అయ్యారు. అయితే కరోనా సోకటంలతో వైద్యసేవలు పొందుతూ జూలై 22న మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి విధులకు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్‌లో రిటైరైన రమేష్ బాబును కూడా ఉద్యోగంలో కొనసాగుతూ మరణించినట్టుగానే గుర్తించి ఉద్యోగంలో ఉండి మరణించిన కార్మికునికి వర్తింపజేసే నిబంధనలనే ఆయనకూ వర్తింపజేశారు. ఈ క్రమంలో రమేష్‌బాబు సతీమణి హేమలతకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును జనరల్ మేనేజర్ కె.సూర్యనారాయణ అందజేశారు. ఆయన స్థానంలో అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం గానీ లేదా ఉద్యోగానికి బదులు రూ.25 లక్షలు సొమ్ము చెల్లింపు ఉంటుందనీ జీఎం తెలిపారు. దీంతో హేమలత ఉద్యోగానికి బదులుగా ఏకమొత్తంలో సొమ్ము చెల్లిస్తామని తెలిపారు.