Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిజామాబాద్ నగరంలో మహిళపై లైంగికదాడి ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించబోదని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ శాఖకు ఆమె అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయబోదని తెలిపారు. నిజామాబాద్లో లైంగికదాడికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.