Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ సజ్జనార్ నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డొక్కు బస్సు...ఇదీ ఆర్టీసీ బస్సుపై ప్రజల అభిప్రాయం. దీన్ని మార్చే ప్రయత్నం టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులపై అశ్లీల ప్రకటనలు ఉండబోవని చెప్పిన ఆయన, హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో బస్సుల రూట్లు, రాకపోకల వివరాలతో టైం టేబుళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. నడిరోడ్లపైన బస్సుల్ని నిలుపవద్దనీ, బస్టాపుల్లోనే ఆపాలంటూ ఆయన డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే బస్టాపులను అక్రమ రవాణా కోసం ఆటోలు, కార్లు, టూ వీలర్లు, కంపెనీ బస్సులు ఆక్రమించడంతో అక్కడ జాగా లేక రోడ్లపై నిలపాల్సి వస్తున్నదని ఆర్టీసీ డ్రైవర్లు చెప్తున్నారు. బస్టాపుల చుట్టుపక్కల అక్రమ రవాణాను నియంత్రించాలని వారు కోరుతున్నారు. తాజాగా డొక్కు బస్సు ముద్రను పోగెట్టేందుకు పాత బస్సులకే కొత్త రంగులు వేయిస్తున్నారు. కంటోన్మెంట్ డిపోలో తొలిబస్సుకు రంగు వేశారు. ముదురు, లేత ఆకుపచ్చరంగులు సిటీ బస్సులకు వేస్తున్నారు. ఈ కలర్లు గతంలో ఆర్టీసీ బస్సులకు ఉన్నవే. అలాగే బస్సుల కండీషన్‌ను చెక్ చేయడంపైనా ఆయన దృష్టి పెట్టారు. ఉన్న వనరులతోనే సంస్థను నిర్వహించడం, ప్రయాణీకులను ఆకర్షించి, ఆదాయం గడించడం అనే లక్ష్యాలతోనే ప్రణాళిక సాగుతున్నది. బస్సులకు రంగులు వేశాక, చూడముచ్చటగా ఉన్నాయని ఆర్టీసీ సిబ్బందే ప్రసంసిస్తున్నారు.