Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హత్నూర మండలం కాసాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు
- సర్పంచి ఏకపక్ష పోకడపై తీవ్ర అసంతృప్తి
- గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆరోపణ
నవ తెలంగాణ-హత్నూర
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది వార్డు సభ్యుల్లో 9 మంది తమ రాజీనామా పత్రాలను సర్పంచి పుల్లయ్యగారి రాణి సమక్షంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డికి అంద జేశారు. వార్డు సభ్యులు మాట్లా డుతూ.. గ్రామంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిం దనీ, సర్పంచి రాణి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో అభి వృద్ధి జరగక తాము వార్డుల్లోని ప్రజల ముందు తలె త్తుకోలేకపోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీ నామా చేసిన వారిలో నడూల్ల ఆమదయ్య 1వ వార్డు, బక్క మహేష్ 4వ వార్డు, కుమ్మరి అర్చన 5వ వార్డు, సాకలి సులోచన 7వ వార్డు, తుడుము మనో హర్ 8వ వార్డు, అందోలు అమత 9వ వార్డు, అందో లు బాలమని 10వ వార్డు, అందోలు ఆంజనేయులు 11వ వార్డు, అందోలు సునీత 12వ వార్డు ఉన్నారు. ఇదివరకే పంచాయతీ పాలకవర్గం సమావేశాలకు కావలిసిన కనీస వార్డు సభ్యుల సంఖ్య లేకుండానే జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలుండగా, ప్రస్తుతం వార్డు సభ్యులు రాజీనామా గ్రామంలో చర్చనీయాంశమైంది.