Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీ ఇచ్చి అమలు చేయని సర్కార్
- గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో పనిచేస్తున్న కార్మికుల అవస్థలు
- సంక్షేమ భవన్‌ముందు ధర్నాలో వక్తల ఆవేదన
- దిగొచ్చిన అధికారులు
- వేతనాలు చెల్లించేందుకు హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులకు లాక్డౌన్ కాలపు వేతనాలు చెల్లించాలని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీవేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌ముందు కార్మికు లు ఆందోళన నిర్వహించారు. దీంతో అధికారులు దిగొచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ అదనపు కమిషనర్ సైదా,డిప్యూటీ డైరెక్టర్ ప్రియాంక వేతనాలు చెల్లించేం దుకు అంగీకరించారు. ఈ సందర్భంగా సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ మాట్లాడుతూ 2020 ఏప్రిల్‌లో లాక్డౌన్ విధించిన ప్రభుత్వం అప్పటి నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించలేదని తెలిపారు. లాక్డౌన్ కాలంలో అందరికీ వేతనాలు ఇస్తామంటూ జీఓ నెం45,జీఓ నెం 102ల్లో పేర్కొన్న ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవటంతో ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు. జీఓలు ఇచ్చి అమలు చేయకపోవటం దారుణమనీ, జీఓ కాగితాలు ఇస్తే మా కడుపు నిండుతుందా? అని ప్రశ్నించారు ఇచ్చిన జీఓలను అమ్లఉ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ విద్యాసంస్థలను ప్రారంభించిన ప్రభుత్వం..సర్కారు ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలలను, హాస్టల్స్‌ను ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలన్నారు. పాఠశాలలు ప్రారంభించి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పార్ట్‌టైం పేరు చెప్పి రోజుకు 13 గంటలు పనిచేయిస్తున్నారని చెప్పారు. కార్మికులను శ్రమదోపిడికి గురిచేస్తున్నారని వివరించారు.
డైలీవేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ ఇటీవల ఇచ్చిన బడ్జెట్నులాక్డౌన్ కాలపు వేతనాల చెల్లింపునకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. దసరా పండుగ లోపు లాక్డౌన్ కాలపు వేతనాలు చెల్లింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనీ, ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. ఈ సందర్భంగా 18 రకాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ధర్నా దగ్గరకు వచ్చిన అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.బ్రహ్మచారి,అధ్యక్షులు టేకం ప్రభాకర్,వర్కింగ్ ప్రసిడెంట్ సురేందర్, నాయకులు హీరాలాల్ రాములు, రవి, రత్నం రాజేందర్, లలిత, సారక్క, సంగ్యా నాయక్, నందులాల్, అనిత, కౌశల్య, వీరన్న అనంతరాములు, పద్మ శ్రీను, రాములు, అనురాధ, ముత్తయ్య, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.