Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వయం సహాయ గ్రూపుల నిర్వహణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీరాజ్( ఎన్ఐఆర్డిపిఆర్) కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ అన్నారు. ఎన్ ఐఆర్డిపిఆర్ 64వ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. ఈసమావేశంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామాల్లో నివసించే సామాన్య ప్రజలను స్వయం సహాయక గ్రూపుగా వివిధ రకాల వృత్తుల నిర్వహణలో ఎన్ఐఆర్డిపిఆర్ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. వారికి జీవనోపాధి కల్పించేందుకు చేతివృత్తులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే సహజ వనరులను ఉపయోగించుకుని గ్రామీణ స్వయం సహాయక గ్రూపుల మహిళలు ఉపాధి పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతం 8కోట్ల దేశ వ్యాప్తంగా 8కోట్ల మంది స్వయం హాయక గ్రూపులు ఉన్నాయనీ, వాటి సంఖ్య మరింత పెరిగి 10కోట్లకు చేరే అవకాశం వుందని చెప్పారు. తద్వారా జీడీపీ కూడా 1.5 శాతం నుంచి 2శాతానికి పెరిగే అవకాశం వుందన్నారు. స్వయం సహాయక గ్రూపులకు వార్షిక అగ్రిబడ్జెట్ పెంపేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతానికి స్వయం సహాయక గ్రూపులు ఇంకా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వారికి ప్రస్తుతం ఉన్నటెక్నాలజీతో పాటు సరికొత్త , వినూత్న టెక్నాలజీ ద్వారా మరింత అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డిపిఆర్ డైరెక్టర్ జనరల్ డా. నరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.