Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం (ఎస్సీఆర్డబ్బ్యుడ బ్ల్యుఓ)... సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆస్పత్రిలో ఆధునీకరించిన లెక్చరర్ హాల్ కోసం 50 ఎగ్జిక్యూటివ్ కుర్చీలను, 40 సాధారణ కుర్చీలను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు జయంతి మాల్య మాట్లాడుతూ... కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమ సంఘం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా మెడికల్, పారామెడికల్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి శానిటైజర్లు, ఎన్-95 ఫేస్ మాస్కులను పంపిణీ చేశామన్నారు.