Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా ప్రొ. కె.నాగేశ్వర్
- ఆ సమావేశాలు భవిష్యత్ పోరాటాలకు దిక్సూచి
- అన్ని రంగాలపైనా మోడీ సర్కారు దాడి
- కార్మికులు పోరాటాల్లోకి వచ్చేలా చైతన్యపర్చాలి : సీఐటీయూ ఉపాధ్యక్షులు ఏకే పద్మనాభన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశ ఆర్థిక స్వావలంబనకు, సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా మోడీ సర్కారు పాలన సాగుతున్న క్లిష్టపరిస్థితుల్లో నవంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించ బోతున్నామనీ, ఆ సమావేశాలు భవిష్యత్ పోరాటాల రూపకల్పనకు దిక్సూచిగా నిలవబోతున్నాయని సీఐటీయూ ఉపాధ్యక్షులు ఏకే పద్మ నాభన్ తెలిపారు. సమావేశాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లోని సీఐటీయూ సెంట్రల్ సిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాల ఆహ్వానం సంఘం ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో జాతీయ సహజవనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్ట బెట్టే పనిలో మోడీ సర్కారు ఉన్నదని విమర్శించారు. రైల్వేలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికం, 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రయివేటీకరణకు పూనుకున్నా రని చెబుతూ అంబానీ జియో కోసం బీఎస్ఎన్ఎల్ ను ఏవిధంగా నిర్వీర్యం చేశారో వివరించారు. కోవిడ్ విపత్తుతో దేశంలోని ప్రజలు ఇబ్బంది పడు తుంటే మోడీసర్కారేమో వారిని ఆదుకోకుండా, ఆర్థిక సహాయాన్ని చేయ కుండా కర్కశంగా వ్యవహరించిందన్నారు. అదే సమయంలో కార్పొరేట్లకు ప్రయోజనాలు చేకూర్చేలా కార్మికకోడ్లను, నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. ప్రతిరోజూ దేశంలో మైనార్టీలు, దళితులు, మహి ళలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. చివరకు మీడి యా, ప్రజాస్వామ్య సంస్థలు, న్యాయవ్యవస్థలపైనా దాడి జరుగుతున్నదని తెలిపారు. రైతుల పోరాటానికి మద్దతుగా స్కీం వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీలు, కోట్ల మంది కార్మికులు సెప్టెంబర్ 27న జరిగిన భారత్‌బంద్‌లో పెద్దఎత్తున పాల్గొన్నారని తెలిపారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యపోరాటాలు చేస్తున్న తరుణంలో ఈసమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. మోడీ అనుసరి స్తున్న దుర్మార్గ విధానాలను కార్మికులకు, ప్రజలకు అర్థమయ్యేలా వివరించేం దుకు క్షేత్రస్థాయిలోకి సీఐటీయూ నాయకులు వెళ్లాలని సూచించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు విశాల ప్రాతిపదికపై ప్రజా, కార్మిక ఉద్యమాలకు సన్నాహాలు చేసే దిశలో ఈ కౌన్సిల్ సమావేశాలు జరుగబోతున్నాయన్నారు. ఐక్యత, పోరాటం నినాదంతో సీఐటీయూ పనిచేస్తున్నదని చెబుతూ ఆ సంఘం ఆవిర్భావం నుంచి నేటి వరకు చేసిన ముఖ్య పోరాటాలను వివరించారు.
ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీజేపీతో లాలూచీ పడేందుకే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారని విమర్శించారు. కార్మికులను పోరాటాల్లోకి వచ్చేలా వారిని చైతన్యపర్చేందుకు జాతీయ కౌన్సిల్ సమా వేశాలు దోహదపడాలని ఆకాంక్షించారు. తెలంగాణలో వామపక్ష భావజా లం బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజాభిప్రా యంలో మౌలిక మార్పు తేవాల్సిన అవసరం సీఐటీయూపై ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. కార్మికవర్గం ఐక్యానికి అడ్డుగోడలుగా ఉన్న ప్రాంతం, కులం, మతం వంటి అస్తిత్వాలను బద్దలు కొట్టాలన్నారు. సైద్ధాంతిక, సాంస్కృతిక భావజాలంపై జరుగుతున్న దాడిని ప్రగతిశీల కార్మిక సంఘాలు తిప్పికొట్టాలన్నారు. పోరాటాలకు సమయం కేటాయించేలా కార్మికులను చైతన్యపర్చాలన్నారు. వినిమయదారీ తత్వం వల్ల జరుగుతున్న నష్టాలను కార్మికులకు వివరించాలని కోరారు. యువ కార్మికులను పోరాటాల్లోకి తీసుకువచ్చేలా సీఐటీయూ కార్యాచరణ ఉండా లని ఆకాంక్షించారు. వర్క్‌ఫ్రం హోం వంటి పనిపద్దతులు కూడా కార్మికుల ఐక్యతకు ఆటంకంగా మారాయన్నారు. కార్మికుల్లో రాజకీయ చైతన్యం పెంపొందించి ఈకార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జి.విద్యా సాగర్ మాట్లాడుతూ.. అన్ని విద్యుత్‌సంస్థల ప్రయివేటీకరణకు మోడ సర్కా రు పూనుకున్నదన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్ష తన జరిగిన ఈ సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ప్రతిపాదించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ జాతీ య ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధా భాస్కర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి, ఏఐఐఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా, అధ్యక్షులు వి.రమేశ్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, ఏఐడీఈఎఫ్ సంయుక్త కార్యదర్శి జిటి గోపాలరావు, బెఫి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా కె.నాగేశ్వర్
సీఐటీయూ జనరల్ కౌన్సిల్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా కె.నాగేశ్వర్‌ను ప్రకటించారు. ఈ కమిటీకి చైర్మెన్‌గా చుక్కరాములు, వైస్ చైర్మెన్‌గా ఎం.సాయిబాబు, చీఫ్ ప్యాట్రన్‌గా ఎ.నర్సిరెడ్డి, జనరల్ సెక్రటరీగా జె.వెంకటేశ్, ట్రెజరర్‌గా ఎ.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు, సభ్యులుగా ప్రజా, కార్మిక, ఫెడరేషన్ల నాయకులు ఉంటారు.