Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రోజే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండు సెట్లు అందజేత
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ శుక్రవారం తన నామినేషన్ వేశారు.ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నామినేషన్లు మొదలైన మొదటి రోజే ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి సెట్లో 'గెల్లు'ను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రతిపాదించారు. రెండో సెట్లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మెన్ కనుమల్ల విజయ ప్రతిపాదిం చారు.నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అఫడవిట్‌ను అందజేశారు. ఆస్తుల వివరాల నమోదును పరిశీలిస్తే గెల్లు శ్రీనివాస్ వద్ద సెల్ఫ్‌గా రూ.2లక్షల 82402బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు తెలిపారు. చేతిలో రూ.10వేలు ఉన్నట్టు పేర్కొన్నారు. తన భార్య పేరు మీద రూ.11లక్షలా 87500విలువజేసే 250 గ్రాముల బంగారం ఉన్నట్టు తెలిపారు. చేతిలో రూ.7వేలు ఉన్నట్టు పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్ పేరు మీద హుజూరాబాద్ మండల పరిధిలో రూ.12లక్షల విలువజేసే 12గుంటల స్థలం ఉన్నట్టుగా తెలిపారు. రూ.20లక్షల విలువజేసే 1210 చదరపు గజాల స్థలంలో ఇల్లు ఉన్నట్టు పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం అంతా స్క్రాప్ బిజినెస్ ద్వారా వస్తున్నట్టుగా తెలపడం గమనార్హం.