Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభలో ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హరితహారం పేరుతో పోడుసాగుదార్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులు ఆత్మగౌవరంతో బతికేలా, వారికి ఆ భూముపై హక్కులు కల్పిస్తూ, పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో హరితహారంపై స్వల్పకాలిక చర్చలో ఆమె మాట్లాడారు.ఆ భూములు నుంచి గిరిజనులు వెళ్లగొట్టడం ద్వారా ఉపాధికి దూరమవుతున్నారని చెప్పారు.పేదల భూముల్లో వైకుంఠదా మాలు, పల్లె ప్రగతి వనాలు ఏర్పాటు చేస్తున్నారనీ, ఆ భూములకు చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. హరితహారం పేదల పాలిట ఇబ్బందికరంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను పెంచడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు. దట్టమైన అడవుల్లోనూ కందకాలు, గుంతలు తొవ్వి వదిలేస్తున్నారనీ, దీంతో కంపా నిధులు దుర్వినియోగమవుతున్నాయని చెప్పారు.
హరితహారం ఓ విప్లవం : ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, గువ్వల బాలరాజు
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తలపెట్టిన హరితహారం కార్యక్రమం ఓ విప్లవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాద వ్, గువ్వల బాలరాజు చెప్పారు. అసెంబ్లీలో హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో వారు మాట్లాడారు.