Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీదేవసేనకు బాధ్యతలు అప్పగింత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు అకాడమి డైరెక్టర్ సోమిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. తెలుగు అకాడమి డైరెక్టర్గా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనకు బాధ్యతలు అప్పగించింది. ఆ అకాడమిలో రూ.43 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్ము గోల్మాల్ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. సీసీఎస్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ వేగంగా కొనసాగుతున్నది.