Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2021 ఆన్లైన్లో ఆదివారం జరగనుంది. ఈ రాతపరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 జరుగుతాయి. దేశవ్యాప్తంగా 229 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఏపీలో 27, తెలంగాణలో 15 కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత పొందిన వారిలో దేశంలో 1.70 లక్షల మంది, రాష్ట్రంలో 14 వేల మంది దరఖాస్తు చేశారు. ఈ ఫలితాలను ఈనెల 15న విడుదల చేస్తారు. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2021 ఈనెల 18న జరుగుతుంది. ఏఏటీ ఫలితాలు ఈనెల 22న విడుదలవుతాయి. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుంది.