Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతు ధరల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంటల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ద్వారా సరైన మద్దతు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో పంటల మద్దతుధరలపై మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పత్తిలో తేమ 8 శాతం నుంచి 12 శాతం ఉండాలనీ, తేమ 8 శాతానికి లోబడి ఆరు, ఏడు శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్ ధర వస్తుందని పేర్కొన్నారు.
పత్తికి మద్దతు ధరల వివరాలు
- తేమ 8 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ.6025, పింజ రకానికి రూ.5925
- తేమ 9 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ.5964.75, పింజ రకానికి రూ.5865.75
- తేమ 10 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ.5,904.50, పింజ రకానికి రూ.5,806.50
- తేమ 11 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ.5,844.25, పింజ రకానికి రూ.5,747.25
- తేమ 12 శాతం ఉంటే క్వింటాల్‌కు రూ.5,784, పింజ రకానికి రూ.5,688
- తేమ 6 శాతం ఉంటే క్వింటా లుకు రూ.6,025కు అదనంగా రూ.120.50, పింజ రకానికి రూ.5,925కి అదనంగా రూ.118.50 చెల్లిస్తారు. తేమ 7 శాతం ఉంటే క్వింటాలుకు రూ.6,025కి అదనంగా రూ.60.25, పింజ రకానికి రూ.5,925కి అదనం గా రూ.59.25 అదనంగా చెల్లిస్తారు.
వరి ధాన్యం సాధారణ రకానికి క్వింటాల్‌కు మద్దతుధర రూ1,940, ఎ గ్రేడ్ రకానికి రూ1,960, కందులు రూ 6,300, పెసర్లు రూ 7,275, వేరుశెనగ రూ.5,550, మినుములు రూ.6300, పొద్దుతిరుగుడు రూ.6015, నువ్వులు రూ.7307, జొన్నలు రూ.2738, రూ.2,758, సజ్జలు రూ.2,250, రాగులు రూ.3,377 గా నిర్ణయించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు తక్షణం అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పంటలను శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు. రైతుల కోసం మార్కెట్ యార్డుల్లో ప్యాడి క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు ఉన్నారు.