Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా శిశు అభివృద్ధి శాఖ కమిషనర్‌కు వినతి
- తెలంగాణ అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2016 జీఓ నాటికి అర్హులైన వారందరికీ గ్రేడ్-2 అంగన్వాడీ సూపర్వైజర్ పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పి ప్రేంపావని, భవాని, విజయకుమారి, నిర్మల,అరుణ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మహిళా శిశు అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ కలిసి వారు వినతి పత్రం అందజేశారు. కమిషనర్ స్పందిస్తూ 2016 జీఓ నాటికి అర్హులైన అంగన్వాడీ టీచర్లందరినీ సూపర్వైజర్ పరీక్షలు రాయటానికి అనుమతిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.