Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అడవుల రక్షణ, హరితహారం నిర్వహణ కోసం హరిత నిధిని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అటవీ శాఖ కొనియాడింది. ఆ శాఖ పనితీరును గుర్తించి, ప్రోత్సహించటంతో పాటు అసెంబ్లీలో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్కు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) శోభ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం పీసీసీఎఫ్ సీఎం కేసీఆర్ను కలిశారు. అటవీ శాఖకు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని గుర్తింపును టీఆర్ఎస్ సర్కారు ఇస్తున్నదనీ, అందుకు తగ్గట్టుగా ప్రతీ అటవీ అధికారి, సిబ్బంది లక్ష్య సాధన కోసం సైనికుల లాగా కష్టపడ్డారని తెలంగాణ ఐ.ఎఫ్.ఎస్ అధికారుల సంఘం తెలిపింది. తమ శ్రమకు తగిన గుర్తింపునిచ్చిన ముఖ్యమంత్రికి ఆ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.