Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములను గుంజుకుంటే ఊరుకోం..
- 5న పోడు భూముల కోసం నిరసనలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జాన్వెస్లీ
నవతెలంగాణ - అమరచింత
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జాన్వెస్లీ అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా అమరచింత ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రాల్లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం పోడు భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని, పోడుదారులను భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. భూములను గుంజుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 2006కేంద్ర అటవీ హక్కు చట్టం ప్రకారం.. ఆదివాసుల దగ్గర ఎంత భూమి ఉంటే అంత ఆదివాసులకి అని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5న పోడు భూములపై జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్చైర్మెన్ జిఎస్.గోపి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.రాజు, బీడీ కార్మిక సం ఘం జిల్లా అధ్యక్షులు బుచ్చన్న, నాయకులు బి.వెంకటేష్, ఎస్.అజరు, ఆర్ఎం.రమేష్, తోఫిక్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.