Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో పదోన్నతులలో జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు, డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ అమర్ సింగ్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ పద్మజ తదితరులు శనివారం కమిషన్ చైర్ పర్సన్ జి.చంద్రయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. డీహెచ్, డీఎంఇ పోస్టులకు ఇన్ ఛార్జీలుగా జూనియర్లను ఏండ్ల తరబడి కొనసాగించటం మొదలు ఆ శాఖలో జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కమిషన్ ముందుకు తీసుకెళ్లినట్టు రమేశ్ మీడియాకు వెల్లడించారు. ఇంతటితో పోరాటాన్ని ఆపేది లేదనీ, బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు.