Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ స్ఫూర్తిదాయకం
- గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
- పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళి అర్పించారు.హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో బాపూఘాట్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,బాపు సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.స్వాతంత్య్ర సమరయోధుడిగా,అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ మనం దరికీ స్ఫూర్తిదాయమని వారు ఈ సందర్భంగా అన్నారు. అంతకుముందు మున్సిపల్,ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సాదరంగా ఆహ్వానం పలికారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రోటెమ్ చైర్మెన్ భూపాల్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ,మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్,ఎంపీలు కేశవ రావు,రంజిత్ రెడ్డి,ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, సురభి వాణి దేవి,ఎమ్మెల్యేలు,టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాగూర్ నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్, మల్లు రవి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి,డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సెక్రటరీ పొలిటికల్ వికాస్ రాజు, టూరిజం సెక్రటరీ శ్రీనివా స్ రాజు, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర సీపీ అంజనీ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శర్మన్ గాంధీజీకి నివాళులర్పించారు.