Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 75 ఏండ్ల భారత స్వతంత్య్రాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం.. స్వతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం 75 వారాల పాటు 'ఆజాదీకా అమృత్ మహౌత్సవ్' కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0ను నిర్వహించింది. హైదరాబాద్లోని పీవీ జ్ఞానభూమి-నక్లెస్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యమ్రంలో ఎస్బీఐ సిబ్బంది సైక్లింగ్ అండ్ వాకింగ్ చేస్తూ పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. అంతకు ముందు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో యోగా, జుంబా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ, యోగా, వాకింగ్, ఏరోబిక్స్, సైక్లింగ్ వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.