Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీత పనివారల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధులు, అఖిల భారత గీత పనివారల కార్మిక సమాఖ్య అధ్యక్షుడు బొమ్మగాని ధర్మభిక్షం శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని గీత పనివారల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని ఆదివారం రాజ్ స్మారక హాల్లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ ధర్మభిక్షం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నిజాం నవాబు కాలంలోనే గీత వృత్తిని కాపాడేందుకు, దున్నేవానికే భూమి, గీసేవానికే చెటు అనే డిమాండ్లతో తమ సంఘం మహత్తర పోరాటాలను నిర్వహించిందని తెలిపారు. ధర్మభిక్షం తన జీవితాన్ని వృత్తి కార్మికులకు అంకితం చేశారని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. గీత వృత్తి దారుల సంక్షేమం, నీరా కేంద్రాల ఏర్పాటు, తాటి, ఈత వనం పెంపకం గురించి కృషి చేయడం అభినంద నీయమన్నారు. చెట్టుమీది నుంచి పడ్డవారి కేసుల పరిష్కారంలో, మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలనీ, పాత పద్దతిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.జి. సాయిలుగౌడ్ , సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కెవిఎల్, కోశాధికారి బొమ్మగాని నాగభూషణం, రాష్ట్ర నాయకులు పబ్బు వీరస్వామి, దూసరి శ్రీరాములు, శంకరయ్య, రాయికింది సైదులు, డి.జి.రాజు, పోలగాని రవి, టి.రాములు, యాదయ్య, సాంబశివుడు, నాగభూషణం తదితరులు హాజరయ్యారు.