Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్
- బండిసంజరు పాదయాత్ర ఎందుకు చేశారో ఆయనకే తెల్వదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, అసలు ఆయన పాదయాత్ర ఎందుకు చేశారో ఆయనకే తెలవదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇలాంటి కామెంట్లను మానుకోవాలని సూచిం చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి పాదయాత్ర సందర్భంగా ఎక్కడ చూసినా పచ్చదనమే ఉందనీ, దీంతో ఆయనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని విమర్శించారు. ఆయన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదన్నారు. తెలంగాణకు ఎంత పెద్ద కరువు
వచ్చినా..మూడేండ్ల వరకు నీటి గోస ఉండబోదని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల భూమిలో దాదాపు 500 టీఎంసీల నీళ్లు నిల్వయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయనీ, ఇప్పుడు 9 కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యా, వైద్యం విషయంలో తమకు ఎవరూ సూచనలివ్వాల్సిన అవసరం లేదన్నారు.. రాష్ట్ర బీజేపీ ఎంపీలకు దమ్ముంటే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం కోసం ఐదారు వేల కోట్లు తీసుకుని రావాలని సవాల్ విసిరారు.