Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు కేసు నమోదు చేయాలని సీపీ ఆదేశాలు
నవతెలంగాణ - హుజురాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు 22మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. కాగా, కార్యాలయంలో నామినేషన్ పత్రాలు ఇవ్వడం లేదని వారు నిరసనకు యత్నించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనీ, వెంటనే అరెస్టు చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా అందరూ ఒక దగ్గరే గుమిగూడినందున.. కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్టు చేసి ప్రత్యేక బస్సులో పోలీస్ స్టేషన్కు తరలించారు.