Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌కు ఐద్వా వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయనీ, వాటికి కారణమైన మద్యం,మాదక ద్రవ్యాలను అరికట్టాలని అఖిలభాతర ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కమిటి అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, రాష్ట్ర నాయకులు ఎండీ షబానా బేగం,పి.శశికళ కోెరారు. ఈ మేరకు వారు సోమవారం ఎక్సైజ్, మాదకద్ర వ్యాల నిరోధక శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బ ంగా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై హింస పెరిగిపోతున్నదని చెప్పారు. ప్రతి 20 నిముషాలకు ఒక లైంగిక దాడి, 93నిముషాలకు ఒక వరకట్న హత్య జరుగుతున్నదంటూ నేర పరిశోధన రిపోర్టులు చెబుతున్నాయని గుర్తుచేశారు. బాలికల సంఖ్య తగ్గిపోతున్న దనీ, 0.6సంవత్సరాల లోపు పిల్లల్లో 1000మంది అబ్బాయిలు ఉంటే.. 914మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారని తెలిపారు.