Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో వాదనలు సోమవారం ముగిశాయి. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో ట్రైబ్యునల్ తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పును అమలు చేయకపోతే తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తామని జస్టిస్ రామకృష్ణన్, జస్టిస్ సత్యగోపాల్తో కూడిన బెంచ్ పేర్కొంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండా డిండి ప్రాజెక్ట్ను నిర్మిస్తోందంటూ ఎన్జీటీలో ఏపీ నీటి పారుదలశాఖ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 8న తదుపరి విచారణ జరగనుంది.