Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాఫిక్ సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ట్రాఫిక్ ఎస్ఐ, కానిస్టేబుల్‌ను మంత్రి కె తారకరామారావు అభినందించారు. వారికి శాలువా కప్పిసన్మానం చేశా రు. వివరాల్లోకి వెళ్తే... గాంధీజయంతి సందర్భంగా బాపూఘాట్ వద్ద మంత్రి కేటీ ఆర్ కారును డ్రైవర్ రాంగ్రూట్లో తీసుకెళ్లారు. ఇది గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కారును ఆపి చలానా విధించారు. కారు మంత్రి కేటీఆర్‌ది అని చెప్పినా వినలేదు. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచార మైంది. దీనితో మంత్రి ట్రాఫిక్ సిబ్బందిని సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకుని, వారి నిజాయితీని ప్రశంసించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించ డంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజున వాహనంలో తాను లేనని చెప్పారు. తన కారుకు విధించిన చలాన్‌ను చెల్లించినట్టు తెలిపారు.