Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్లో కలిశారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్టు తెలిసింది. అయితే వీరి భేటీ పట్ల అసెంబ్లీ లాబీల్లో చర్చనీయాంశమైం ది. అధికార టీఆర్ఎస్తో సన్నిహితం గా ఉంటున్న ఎంఐఎంతో రేవంత్ భేటీ కావటంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.