Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం తెల్ల బంగారం పోటెత్తింది. మార్కెట్లో పత్తి యార్డ్తో పాటు పరిసర ప్రాంతాలు పత్తి బస్తాలతో నిండాయి. గత నెల 22న మార్కెట్ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి కొత్త పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ రావడంతో వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు పత్తిని కొనుగోలు చేశారు. సోమవారం పదివేలకు పైగా పత్తి బస్తాలు మార్కెట్కు వచ్చాయి. మార్కెట్లో క్వింటాల్ పత్తి రూ.7200/- ధర పలికింది.