Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియాంకగాంధీ అరెస్టుకు నిరసన
- సర్కారు దిష్టిబొమ్మ దహనం...క్యాండిల్ ర్యాలీ
- ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలి :రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్/ సుల్తాన్‌బజార్
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నలుగురు రైతులపై వాహనాలతో తొక్కించిన కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను వెంటనే అరెస్ట్ చేయాలంటూ టీపీసీసీ అందోళన చేపట్టింది. రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని అరెస్టు చేయడాన్ని ఖండించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్‌లో రైతులను బీజేపీ కేంద్ర మంత్రి కుమారుడు కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్డడించేందుకు యత్నించింది. ఆఫీస్‌లోకి చొచ్చుకుపోయేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, బేగంబజార్‌కు తరలించారు. పీఎం మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతకు ముందు గాంధీభవన్ వద్ద యూపీ బీజేపీ సర్కారు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆ సమయంలో ఉద్రికత్త పరిస్తితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులను మొహరించారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద మహిళలు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, కోటూరి మానవతారారు, హర్కర వేణుగోపాల్, ఈర్ల కొమురయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, ప్రసాద్, రవి, ప్రీతమ్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయికుమార్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి ఉన్నారు.
ప్రియాక అరెస్టును ఖండించిన రేవంత్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఖండించారు. సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌లో దీక్షలు చేస్తున్న రైతులపై కుట్ర పూరితంగా, క్రూరంగా కారుతో తొక్కించి నలుగురు రైతులను చంపేసిన కేంద్ర హౌం శాఖ సహాయ అజరు మిశ్రా కుమారుడుపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అజరు మిశ్రాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. రైతులను చంపిన వారిని వదిలేసి పరామర్శించేందుకు వెళ్లే వారిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నియంత, నిర్బంధ పాలన కొనసాగిస్తున్నదని చెప్పారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంకగాంధీని విడుదల చేసి దోషులను శిక్షించాలనీ, రైతు కుటుంబలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆమెను అరెస్టు చేయడం మోడీ, యోగి అసమర్థత పాలనకు నిదర్శనమన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి పాలన నేరస్తులకు అనుకూలంగా మారిపోయిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జె గీతారెడ్డి విమర్శించారు.