Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేని పరిస్థితి
- బిల్లులు బకాయిల్లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెరుగుతున్న ధరలకనుగుణంగా మధ్యాహ్న భోజ నం రేట్లను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రొటెం చైర్మెన్ భూపాల్‌రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన పిటిషన్ సమర్పిం చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులు మధ్యాహ్న భోజనం రేట్లు తక్కువగా ఉండడం వల్ల వంట ఏజెన్సీలు పౌష్టి కాహారాన్ని అందించలేకపోతు న్నాయని వివరిం చారు. వారానికి మూడు రోజులు గుడ్డు పెట్టాలని ఆదేశాలున్నాయనీ, అందుకు రూ.4 మామ్రే చెల్లిస్తున్నారని అన్నారు. కానీ మార్కెట్లో గుడ్డు ధర రూ.6 ఉందన్నారు. దీంతో ఏజెన్సీలు గుడ్డుకు అయ్యే అదనపు ఖర్చును వారి చేతినుంచి భరిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొ క్కరికీ రూ.4.93 పైసలు, ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ఒక్కొక్కరికీ రూ.7.45 పైసలు చెల్లిస్తు న్నారని వివరించారు. వంటచేసే వారికి నెలకు రూ.వెయ్యి పారితోషికం ఇస్తున్నారని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే వంట ఏజెన్సీలను నడుపుతున్నారని చెప్పారు. మధ్యాహ్న భోజనం రేట్లను ప్రాథమిక పాఠశాలల ఒక్కో విద్యా ర్థికీ రూ.8, బియ్యం 150 గ్రాములు, ఉన్నత పాఠ శాలల్లో ఒక్కో విద్యార్థికి రూ.12, బియ్యం 200 గ్రా ములు, గుడ్డు ధర రూ.6 చెల్లించాలని డిమాండ్ చేశారు. వంట చేసే వారి పారితోషికం రూ.3 వేలకు పెంచాలని కోరారు. మధ్యాహ్నభోజనం బిల్లులు బకా యిల్లేకుండా ప్రభుత్వం చర్యలుతీసుకోవాలని సూచిం చారు. ప్రతినెలా బిల్లులు చెల్లించాలని అన్నారు.
ఎస్పీఎఫ్ చట్టాన్ని సవరించాలి
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను 25/1991 చట్టం ద్వారా ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన ర్వాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చట్టాన్ని సవరించకపోవ డం వల్ల రాష్ట్రం నుంచి ఎస్పీఎఫ్లో పనిచేస్తున్న వారికి నష్టం కలుగుతున్నదని తన దృష్టికి వచ్చింద న్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని సవరించాలని కోరారు. డీజీపీ పరిధిలోకి ఎస్పీ ఎఫ్‌ను తేవాలని సూచించారు. ఇతర ఆర్మ్డ్ ఫోర్స్‌కు వర్తించే సౌకర్యాలన్నీ ఎస్పీఎఫ్లో పనిచేస్తున్న వారికి ఇవ్వాలని ప్రత్యేక ప్రస్తావన ద్వారా వివరించారు.
విద్యావాలంటీర్లను నియమించాలి : జీవన్‌రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగు తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి చెప్పారు. కరోనా వల్ల ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న విద్యా ర్థులు సర్కారు బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు. విద్యావాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు పాఠశాలలకు రాకపోవడంవల్ల పారిశుధ్యం నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. స్వచ్ఛ కార్మికు లను నియమించాలని కోరారు. గురుకుల విద్యాసం స్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని సూచించారు.