Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభ, శాసనమండలి గురువారానికి వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సెప్టెంబరు 27 నుంచి ఉభయ సభలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరసగా శాసనసభ, మండలిని వరసగా మూడు రోజులపాటు వాయిదా వేశారు. తిరిగి ఈనెల ఒకటిన ఉభయ సభలు ప్రారంభం కాగా, శనివారం, ఆదివారం మళ్లీ సెలవులొచ్చాయి. సోమ, మంగళవారం రెండు రోజులపాటు వాటిని నిర్వహించిన అనంతరం... బతుకమ్మ వేడుకల ప్రారంభాన్ని పురస్కరించుకుని బుధవారం కూడా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలో శాసనసభ, మండలి తిరిగి గురువారం ప్రారంభం కానున్నాయి.