Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో భట్టి, అక్బరుద్దీన్ ఓవైసీ
- మూడెకరాలు ఇవ్వరా?: అక్బరుద్దీన్ ఓవైసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించాలని మంగళవారం శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ..దళిత బంధు పథకం అమలు తర్వాత మూడెకరాల భూ పంపిణీని అమలు చేస్తారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ పథకం వర్తించేందుకు ప్రాతిపదిక ఏమిటని అడ ిగారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ స్కాలర్షిప్పుల జాప్యంపై ప్రశ్నించారు. దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పిస్తే దాన్ని మరింత పకడ్బందీగా, నిరంతరాయంగా అమలు చేయొచ్చునని సూచించారు. సచార్, తదితర కమిటీలు, కమిషన్లు ముస్లింల బతుకులు దుర్భరంగా ఉన్నాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ముస్లిం జీవనవిధా నాన్ని మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ..బీసీ జనగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలని కోరారు.